పేరు మార్చుకున్న ‘అర్జున్ రెడ్డి’ - MicTv.in - Telugu News
mictv telugu

పేరు మార్చుకున్న ‘అర్జున్ రెడ్డి’

September 7, 2017

‘అర్జున్ రెడ్డి’ హీరోతో ఒక్కసారిగా తారస్థాయికి వెళ్లిన విజయ్ దేవరకొండ పేరు మార్చుకున్నాడు. పూర్తి పేరైన విజయ్ సాయి దేవరకొండలోని సాయిని తొలగించుకున్నాడు. ఈ విషయాన్ని అతడే ట్విటర్లో తెలిపాడు. ‘విజయ్‌ సాయి  అనే పేరు నా స్కూలు రోజులను గుర్తుచేస్తుంది. కానీ ఇప్పుడు నేనో నటుణ్ని కదా. నాకు నచ్చినట్లు పేరు మార్చుకోవచ్చు. స్కూల్లో ఉన్నప్పుడు నేను పుస్తకాలపైన దేవరకొండ అని రాస్తే టీచర్‌ కొట్టేది’ తెలిపాడు ఈ యంగ్ హీరో. కొందరు నెటిజన్లు ఈ  పేరు మార్పుపై సరదా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ తన పేరును అర్జున్ రెడ్డిగా మార్చుకుంటే ఇంకా బావుండేదని కొందరు చెబుతోంటే, మరికొందరు మాత్రం ‘విజయ్ అర్జున్ రెడ్డి’ అని పెట్టుకుంటే బావుంటుందని సలహా ఇస్తున్నారు.