పెళ్లి చూపులు సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించి.. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. టాలీవుడ్ తనకంటూ ఓ మేనరిజాన్ని సంపాధించుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అందరికి అందుబాటులో ఉంటూ పలు మంచి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. కరోనా సమయంలోనే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం అండగా నిలిచాడు. తాజాగా విజయ్ ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నారు.
విజయ్ ఇన్‌స్ట్రాగ్రాంలో ఫాలోవర్స్‌ను ఒక్కసారిగా పెరిగిపోయారు. ఏకంగా అతన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 70 లక్షలకు చేరింది. అంటే దక్షిణాది హీరోల్లో ఎవరికి లేనంతగా అత్యధిక ఫాలోవర్స్‌ను సంపాధించుకొని అతడు సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. రెండేళ్ల క్రితం 2018 మార్చి 7న విజయ్ దేవరకొండ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాని ప్రారంభించారు. ఇంత తక్కువ సమయంలోనే 7 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి విజయ్ తన ఫాలోవర్స్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. కాగా ప్రస్తుతం ఇతడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.