‘అర్జున్ రెడ్డి’  ట్రెండ్ సెట్టర్..!  - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’  ట్రెండ్ సెట్టర్..! 

August 25, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరోె విజయ్ దేవరకొండకు రాం గోపాల్ వర్మ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. విజయ్ ని ఆకాశానికెత్తెస్తూ తెగ పొగిడేస్తున్నాడు ఆర్జీవీ. అర్జున్ రెడ్డి సినిమా చూశాక విజయ్ అంతోడు , ఇంతోడు అని కొనియాడారు.

‘‘ విజయ్ ట్రెండ్ సెట్టర్.. ఈ తరం హీరో.. ఇప్పటివరకు తెరపైన అందరు హీరోలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , స్లో మోషన్,  టెక్నికల్ ఎఫెక్ట్స్ లతో హీరోలుగా రాణించారు. అవి లేకపోతే హీరో లుక్ హుళక్కే.. కానీ విజయ్ కి అలాంటివి ఏమీ లేకుండానే హీరోగా దుమ్మురేపాడు.. ’’ అని వర్మ ఫేస్బుక్ లో పోస్టు పెట్టాడు. గతంలో అమితాబ్, ఇప్పుడు విజయ్ అని, ఇలా సహజంగా, అసలు సిసలు హీరో లుక్స్ తో అదరగొట్టింది వీరిద్దరే అని రాశాడు.

అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డిని కూడా వర్మ ఆకాశానికెత్తేశాడు. అతన్నుంచి నేటి దర్శకులు చాలా నేర్చుకోవాలని, సందీప్ ఈ అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త ట్రెండ్ సృష్టించాడని మెచ్చుకున్నాడు. సహజంగానే రొమాన్స్, హింస, మాఫియా, సైకో వంటి సినిమాలు తీస్తూ, మెచ్చుకుని వర్మకు వాటిలో కొన్నింటితో రూపొందిన అర్జున్ రెడ్డి తెగ నచ్చేయడంలో వింతేమీ లేదని సినీ వర్గాలంటున్నాయి.