ఆర్జీవీ కండలు చూసి నవ్విన ‘అర్జున్ రెడ్డి’ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీ కండలు చూసి నవ్విన ‘అర్జున్ రెడ్డి’

September 5, 2017

‘అర్జున్ రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన రాం గోపాల్ వర్మ.. విజయ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. వీరిద్దరూ తాజాగా హైదరాబాద్ లోని హోటల్లో హల్ చల్ చేశారు. జోకులు, ఘాటు కామెంట్లు పేల్చుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఆర్జీవీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.  ‘నా కండలు చూసి నవ్వుతున్న విజయ్ దేవరకొండ’ ని క్యాప్షన్ పెట్టారు. విజయ్.. ఫేక్ పవర్ స్టార్(పవన్ కల్యాణ్), నితిన్ లకంటే విజయ్ మంచి నటుడని, ట్రెండ్ సెట్టర్ అని, అమితాబ్ తర్వాత అంత గొప్పనటుడు విజయేనని వర్మ ప్రశంసలు కురిపిస్తుండటం తెలిసిందే.