విజయ్ దేవరకొండ న్యూ మూవీ... - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ దేవరకొండ న్యూ మూవీ…

July 31, 2017

ఎవడే సుబ్రమణ్యం, పెళ్లి చూపులు మూవీస్ తో హ్యట్రిక్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటీకే మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడిగా ఉండబోతుందట.

విజయ్ దేవరకొండ ఈ మూవీలో లావణ్య త్రిపాఠి తో జోడి కట్టనున్నట్లు ఫీలింనగర్ వర్గాల సమాచారం. పరుశురామ్, లావణ్యత్రిపాఠి అండ్ టీంతో కలసి పనిచేసేందుకు ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నట్లు విజయ్ చెప్పారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు సిద్దగా ఉంది.తనదైన తెలంగాణ యాసతో అందర్ని మెప్పించిన విజయ్ ఈ కొత్త సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో మరి.