అర్జున్ రెడ్డికి మెహ్రీన్ ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డికి మెహ్రీన్ ఫిదా

November 22, 2017

టాలీవుడ్‌లో సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది మెహ్రీన్. అందచందాలతోనే కాకుండా నటనతోనూ యువతకు గిలిగింతలు పెడుతోంది. కెరీర్‌పై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న మెహ్రీన్ సినిమాలను ఆచితూచి ఎంచుకుంటోంది. ‘రాజా ది గ్రేట్’,  ‘మహానుభావుడు‘తో లైన్లో పడిన మెహ్రీన్ తాజాగా ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండపై దృష్టిసారించింది.తనకు అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగా నచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.  ‘సినిమాల్ల బిజీగా ఉన్నాను.. కొత్త సినిమాలను పెద్దగా చూడ్డం లేదు. అయితే వీలు చిక్కినప్పుడు కొన్ని సినిమాలు చూశాను. ‘అర్జున్ రెడ్డి’ చాలా బాగుంది. యువతకు ఆకట్టుకునేలా ఉంది. అవకాశం వస్తే విజయ్ దేవరకొండతో తప్పకుండా నటిస్తాను.. ’ అని చెప్పింది మెహ్రీన్ ఆమె తాజా చిత్రం ‘జవాన్’ డిసెంబర్ 1న విడుదల కానుంది.