అర్జున్‌రెడ్డి ఈజ్ బ్యాక్.. డియర్ కామ్రేడ్ టీజర్ ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్‌రెడ్డి ఈజ్ బ్యాక్.. డియర్ కామ్రేడ్ టీజర్ ఇలా

March 17, 2019

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ అభిమానుల్లో తనపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తున్నాడు. తాజాగా విజయ్ నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఆదివారం రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నాడు. విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన గీతగోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. అంతేకాదు వీరిది బెస్ట్ జోడి అని ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో మంచి ముద్ర పడిపోయింది. మరోసారి ఇద్దరు కలిసి వస్తుండటంతో సినిమా ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్‌ ఇన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.