గీతా ఆర్ట్స్ బ్యానర్లో విజయ్! - MicTv.in - Telugu News
mictv telugu

గీతా ఆర్ట్స్ బ్యానర్లో విజయ్!

September 6, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ, ఇగ బ్రేకుల్లేకుండా స్వీడ్ గ సినిమాలు చెయ్యడానికి సిద్దమయ్యాడు. తన తర్వాత సినిమా గీతా ఆర్ట్స్  బ్యానర్లో చెయ్యబోతున్నాడు. విజయ్ తో  ఓ సినిమా చేయ్యబోతున్నట్లు గీతా ఆర్ట్స్ ప్రకటించింది. ఈ మధ్య ‘ శ్రీరస్తు శుభమస్తు’ అనే సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన డైరెక్టర్ పరుశరామ్ కు ఈ సినిమా దర్శకత్వం బాద్యతలు అప్పగించారట. సాండల్ వుడ్ లో ‘కిరిక్ పార్టీ’ సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్న రష్మిక, విజయ్ సరసన హీరోయిన్ గా నటించనుందట. ఇద్దరు ఒక్క సినిమాతో సెనేషనల్ గా మారిన స్టార్స్ కావటం, మరియు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లో ఈ చిత్రం వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయ్ భరత్ కమ్మ అనే డైరెక్టర్ కథ కూడా ఓకే చేశాడు. అందుకే సీనీ ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని ఇందుకే అంటారు కావచ్చు ఆ ఒక్క ఛాన్సులో  ’అర్జున్ రెడ్డి’ బంపర్ హిట్ తగిలితే ఇగేముంది ఇలా విజయ్ దేవరకొండ లెక్కనే బిజీ ఐపోవచ్చు. అదే సినిమా తేడా కొడితే అవకాశాలు రాక బతుకు బస్టాండు కూడా కావచ్చు. అందుకే సినిమా జీవితానికి గ్యారంటీ, వ్యారంటీ ఉండదంటారు చాలామంది.