'ఫైటర్'కి జోడి దొరికింది..అనన్యతో విజయ్ రొమాన్స్! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఫైటర్’కి జోడి దొరికింది..అనన్యతో విజయ్ రొమాన్స్!

January 20, 2020

gbcg

 

Vijay Deverakonda

IT'S OFFICIAL… Karan Johar and Puri Jagannadh join hands… Their first collaboration – starring #VijayDeverakonda – starts filming in #Mumbai today… Will release in #Hindi and all South Indian languages… Produced by Puri Jagannadh, Charmme Kaur, Karan Johar, Apoorva Mehta.#VijayDeverakonda flew to #Thailand to learn mixed martial arts and other fight forms for his role… Costars #RamyaKrishnan and #RonitRoy… The title is not finalized yet. #VD10 #PJ37 ‪#VdPjShootBegins

Publiée par Taran Adarsh sur Dimanche 19 janvier 2020

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ఫైటర్‌’ సినిమాకు హీరోయిన్ దొరికేసింది. బాలీవుడ్ నటి అనన్య పాండేను ఎంపిక చేసినట్టు సమాచారం. అనన్య బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురు. ఈ అంశమై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. తొలుత ‘ఫైటర్‌’ సినిమా కోసం శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ సంప్రదించారు. కానీ, డేట్స్‌ లేకపోవడంతో ఆమె చేయలేకపోయింది.

దీంతో అనన్య పాండేను సంద్రించారు. ఆమె నటించేందుకు ఒప్పుకున్నారు. అనన్య ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ అనే బాలీవుడ్‌ సినిమాతో వెండితెరకు తెరంగేట్రం చేశారు. ‘ఫైటర్‌’ సినిమా షూటింగ్ సోమవారం నుంచి మొదలు కానుంది. 15 రోజులు పాటు ముంబాయిలో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగనుంది. రెండో షెడ్యూల్‌ నుంచి అనన్య పాండే షూటింగ్‌లో పాల్గొననుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. పూరీ జగన్నాథ్‌, కరణ్‌ జోహార్‌, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమా బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందనుంది. ఇందుకోసం విజయ్ థాయ్‌లాండ్‌లో మిక్సిడ్‌ మార్సల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.