విజయ్ దేవరకొండకు.. ఎవరూ నచ్చలేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ దేవరకొండకు.. ఎవరూ నచ్చలేదు..

March 9, 2018

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాప్ గేర్లోకి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ.. మూస పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యం చూపిస్తున్నాడు. రాజకీయాల నేపథ్యంలో సాగే తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. దీనికి ‘నోటా’ అని టైటిల్ ఖారు చేశారు. ఎన్నికల్లో ఓటర్లకు అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే(నన్ ఆఫ్ ద అబోవ్.. నోటా) వారెవరికీ ఓటేయకుండా ఈవీఎంలలో నోటా మీటను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నోటా మూవీకి ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.విజయ్ దేవరకొండ గతంలో చేసిన పాత్రలకి నోటా పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. విజయ్ నోటాకు ఓటు వేసినట్లు ఈ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. నోటా పేరుతో అతడు ఉద్యమం లేవదీసి, జనమంతా నోటాకు ఓటేసేలా చేస్తాడని సమాచారం. ఈ మూవీలో విజయ్‌తో మెహ్రీన్ జోడీకడుతోంది. సంగీతాన్ని సి.ఎస్‌. శ్యామ్ అందిస్తున్నారు.