మోస్ట్ డిజైరబుల్ మ్యాన్.. విజయ్ దేవరకొండ - MicTv.in - Telugu News
mictv telugu

మోస్ట్ డిజైరబుల్ మ్యాన్.. విజయ్ దేవరకొండ

March 14, 2019

విజయ్ దేవరకొండ.. తెలుగు చిత్రసీమలో ఓ సంచలనం. అనది కాలంలోనే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్తానం ఏర్పాటు చేసుకొని ఒక్కో సినిమాకు తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండకు అరుదైన గౌరం దక్కింది. ప్రఖ్యాత హైదరాబాద్ టైమ్స్ సంస్థ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ 2018 జాబితాలో విజయ్ మొదటి స్తానంలో నిలిచాడు. తరువాతి స్థానాల్లో టాలీవుడ్ నటులు ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, రానా, ఎన్టీఆర్‌లు ఉన్నారు.

Vijay Devarakonda pips top stars to claim No 1 spot

విజయ్ వీరందరిని వెన‌క్కి నెట్టి మొదటి స్థానం ద‌క్కించుకోవడం విశేషం. 2017లో రెండో స్థానంలో ఉన్న విజ‌య్ ఈ ఏడాది మొదటి స్థానం ద‌క్కించుకోవ‌డం విశేషం. గత ఏడాది తొలి స్థానం సాధించిన మోడల్ బసీర్‌ అలీ ఈ ఏడాది ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, మహేష్ బాబు రెండు, మూడు , నాలుగు స్థానాల‌లో నిలిచారు. ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ చిత్రం చిత్రీకరణలో ఉన్న విజయ్‌ దేవరకొండ తరువాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లోనూ నటించనున్నాడు. అలాగే తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.