యురేనియం వద్దు.. సోలార్ ముద్దు.. విజయ్ దేవరకొండ - MicTv.in - Telugu News
mictv telugu

యురేనియం వద్దు.. సోలార్ ముద్దు.. విజయ్ దేవరకొండ

September 12, 2019

నల్లమల అటవీ పరిక్షణ కోసం టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ‘సేవ్ నల్లమల’ పేరుతో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల శేఖర్ కమ్ముల, దర్శకుడు వేణు ఉడుగుల ముందుకు రాగా తాజాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన మద్దతు తెలిపారు. తాజాగా ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ’సేవ్ నల్లమల’ అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 

దీనిపై విజయ్ స్పందిస్తూ యురేనియం తవ్వకాల వల్ల 20 వేల ఎకరాల్లో ఉన్న నల్లమల అడవి ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.  ‘ఇప్పటికే మన గాలి,నీరు, పర్యావరణం అంతా కలుషితం అయిపోయింది. సౌకర్యవంతమైన జీవితం కోసం స్వచ్ఛమైన గాలి లేకుండా చేసుకున్నాం. ఇలా ప్రతిసారి పర్యావరణాన్ని ధ్వసం చేస్తూ పోతున్నాం ఇప్పుడు అందులో నల్లమల అడవులు కూడా ఉన్నాయి.యురేనియం కావాలంటే కొనుక్కోవచ్చు.. అడవులను కొనవచ్చా. విద్యుత్ తయారీ కోసం  యురేనియంతో వెలికి తీసే కంటే సౌర విద్యుత్ శక్తిపై అవగాహన పెంచండి. గాలి,నీరు, సరైన ఆహారం లేనప్పుడు మనకు ఇవన్నీ దేనికోసం అంటూ ప్రశ్నించారు.