రిపోర్టర్ అర్జున్ రెడ్డి ఆఫీసు ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

రిపోర్టర్ అర్జున్ రెడ్డి ఆఫీసు ఇదే..

February 6, 2018

అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ సినిమాలతోపాటు వ్యాపార ప్రచారాల్లోనూ బిజీగా ఉన్నాడు. పేరుతోపాటు డబ్బూ బాగానే ఆర్జిస్తున్నాడు. తను నటిస్తున్న ‘మహానటి’ చిత్రం గురించి అతడు తరచూ ఏదో ఒక విశేషం చెబుతూనే ఉన్నాడు. అలనాటి ప్రఖ్యాత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ బయోపిక్‌లో విజయ్ అక్కినేని నాగేశ్వరరావుగా నటిస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.

అయితే అది నిజం కాదని, తాను జర్నలిస్టుగా నటిస్తున్నానని విజయ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. తనతోపాటు సమంత కూడా జర్నలిస్టుగానే నటిస్తోందన్నాడు. తాజాగా మహానటి మూవీ కోసం వేసిన ఒక ఆఫీస్ సెట్ ఫోటోను విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1980ల వాతావరణాన్ని గుర్తుకుతెచ్చేలా ఉన్న ఈ ఆఫీసులోనే తను పనిచేస్తున్నట్లు చెప్పాడు. కథను బట్టి చూస్తే సావిత్రి చివరిరోజులకు సంబంధించిన విశేషాలను తెలిపే జర్నలిస్టుగా విజయ్ కనిపించే అవకాశముంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘మహానటి’లో కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషిస్తోంది.. దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, క్రిష్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు.