తరుణ్‌ సినిమాలో ఆమే హీరోయిన్.. విజయ్ దేవరకొండ - MicTv.in - Telugu News
mictv telugu

తరుణ్‌ సినిమాలో ఆమే హీరోయిన్.. విజయ్ దేవరకొండ

April 16, 2019

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వరుస విజయాలతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు. తాజాగా విజయ్ డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రౌడీ సరసన రష్మిక మందన్న మరోసారి నటిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే గీతగోవిందం సినిమాతో సక్సెస్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. భరత్ కమ్మ .. కామ్రేడ్‌కు దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు హీరోగా మాత్రమే ఉన్న విజయ్.. ఇప్పుడు నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాడు. ఎవరితో అనుకుంటున్నారా?

Vijay devarakonda says.. Hero Tarun Bhaskar, Heroine Vani Bhojan New Movie In Vijay devarakonda Production.

పెళ్లి‌చూపులు సినిమాతో విజయ్‌కి సక్సెస్ అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నిర్మాత విజయ్ దేవరకొండనే కావడం విశేషం. ఇటీవల విజయ్ స్థాపించిన ప్రొడక్షన్‌లోనే తరుణ్ సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి చూపులు తో విజయ్‌ని హీరోగా చేసిన తరుణ్ భాస్కర్‌ను  విజయ్ హీరోగా మార్చనున్నాడు. ఈ సినిమాకు సమీర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఇన్నాళ్లు తరుణ్ సరసన ఎవరు నటిస్తారా అని అందర్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమిళ సీరియల్ నటి వాణి భోజన్ ను ఎంపిక చేశారు. దేవమగళ్ సీరియల్‌తో వాణి భోజన్ తమిళనాడులో చాలా ఫేమస్ అయ్యింది.  ఈ సినిమాతో తను కూడా హీరోయిన్‌గా మారుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.