‘సెన్సార్’పై  విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

‘సెన్సార్’పై  విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

September 29, 2018

‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ నటించిన నోటా చిత్రం విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ రాజకీయనాయకుడిగా కనిపిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది.Vijay Devarakonda Sensational Comments On Sensor Board For Nota Movieఅయితే సెన్సార్ బోర్డు ఈ మూవీ తమిళ వర్షెన్‌కు ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. దీనిపై విజయ్ ఓ కామెంట్ చేశాడు. ‘తమిళ్‌లో ‘ఏ’ సర్టిఫికేట్‌ అనుకుంటే ‘యూ’ వచ్చింది.. మరి నాకు ఇష్టమైన తెలుగు సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికేట్‌ ఇస్తుందో చూడాలి’ అంటూ విజయ్ ట్వీట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. విజయ్ ‘అర్జున్‌ రెడ్డి’ సమయంలో సెన్సార్‌ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ‘నోటా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 30న విజయవాడ, అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లో జరగనుంది.