ట్యాక్సీవాలా దుమ్మురేగ్గొట్టాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్యాక్సీవాలా దుమ్మురేగ్గొట్టాడు..

March 23, 2018

‘అర్జున్ రెడ్డి’ మూవీతో టాప్ గేర్ లోకి వెళ్లిపోయాడు కుర్ర హీరో విజయ్ దేవరకొండ. త్వరలో ‘ట్యాక్సీవాలా’తో మనముందుకు రానున్నాడు. తాను ఈ మూవీలో నడిపే ట్యాక్సీని విజయ్ ఇదివరకే పరిచయం చేశాడు. తాజాగా ఈ మూవీ లోగో కమ్ చిన్న వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. విజయ్ ట్యాక్సీలో దుమ్మురేగ్గొడుతూ వెళ్తున్నాడు.

విజయ్ క్యాబ్ డ్రైవర్‌గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా రాహుల్ సాంక్రిత్యన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విజయ్ సరసన ప్రియాంకా జవల్కర్ జోడీ కట్టింది. దీనికి సంబంధించిన టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని టీం తెలిపింది. ఎస్కేఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నాయి. ట్యాక్సీవాలాను మే 18న విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు ఉన్నాయి.  సావిత్రి బయోపిక్ ‘మహానటి’తోపాటు ‘నోటా’లోనూ అతడు నటిస్తున్నాడు.