మీరు అర్జున్ రెడ్డి ట్యాక్సీ ఎక్కుతారా? - MicTv.in - Telugu News
mictv telugu

మీరు అర్జున్ రెడ్డి ట్యాక్సీ ఎక్కుతారా?

February 9, 2018

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో విజయ్ దేవరకొండ గ్రాఫ్ ఎంత ఎత్తుకు చేరిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి యువతరం మెచ్చే అన్ని హంగులూ ఉన్న ఈ యువనటుడి చేతిలో ప్రస్తుతం ఐదారు చిత్రాలు ఉన్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ఈ స్టార్.. భారీ పారితోషికాలు తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలకు యాంటీ పబ్లిసిటీలో లాభాల పంట పండిన నేపథ్యంలో నిర్మాతలూ సై అంటున్నారు.

అర్జున్ రెడ్డి ‘ట్యాక్సీవాలా’ అనే సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే.  కాసేపటికి కింద విజయ్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్టర్ ఆసక్తి రేకిస్తోంది. ఇట్స్ టైమ్.. ఐయామ్ బ్యాక్ అని విజయ్ కారు ఫోటోను పోస్ట్ చేసి రాశాడు. ఈ చిత్రానికి రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో తీస్తున్న ఈ సినిమాల రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నాడు.

విజయ్ ఈ మూవీతోపాటు గీతా ఆర్ట్స్ చిత్రంలోనూ, సావిత్ర జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.