విజయ్ దేవరకొండ సరసన సాహో విలన్ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ దేవరకొండ సరసన సాహో విలన్ కూతురు

February 20, 2020

fxbg

విజయ్ దేవరకొండ.. పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ ఖరారు చేసారు. తెలుగు, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, డేట్స్ కాలిలేకపోవడంతో జాన్వీ ఈ సినిమాకు ఒకే చెప్పలేకపోయారు. దీంతో ఈ అవకాశం సాహో సినిమా విలన్ ఛంకీ పాండే కూతురు అనన్య పాండేకు దక్కింది. ఈ సినిమా కథ వినగానే అనన్య ఓకే చెప్పిందని సమాచారం. గతేడాది బాలీవుడ్‌ వచ్చిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2’ సినిమాతో అనన్య తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలో నటించింది. ఇటీవల ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో అనన్య బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు గెలుచుకుంది.