Vijay Devarakonda went to Dubai to watch the India-Pakistan match
mictv telugu

లైగర్ ఫ్లాపయినా తెగ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

August 29, 2022

 

భారీ అంచనాల మధ్య విడుదలైన పూరీ – విజయ్ దేవరకొండల చిత్రం లైగర్ ఫ్లాపయింది. దీంతో చిత్ర బృందం అంతా నిరాశలో కూరుకుపోయారు. పూరీ, చార్మీ సహా ఇతర నటీనటులు ఎవరూ కూడా బయట దాదాపు కనిపించడం లేదు. అయితే విజయ్ మాత్రం ఆ విషయం గుర్తులేనట్టు తదుపరి కార్యక్రమాల్లో మునిగిపోయాడు. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన దాయాదుల క్రికెట్ మ్యాచుకు హాజరయి చిల్ అయ్యాడు. అంతేకాక, క్రికెటర్లు జతిన్ సర్ఫు, ఇర్ఫాన్ పఠాన్‌లతో కలిసి సందడి చేశాడు. తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కుర్తా, పైజామా ధరించి మ్యాచుకు ముందు విజయ్ చేసిన అల్లరితో కూడిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..‘నాకు ఎనర్జీ ఎక్కువ. కోహ్లీ కనీసం 50 రన్స్ చేస్తాడని ఆశాభావంతో ఉన్నాను. ఒక్కసారి 20 దాటితే ఈజీగా ఆ మార్కును దాటగలడు. కోహ్లీకి ఇది వందో మ్యాచ్ కావడంతో చూడడానికి వచ్చాను’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, క్రికెటర్ల బయోపిక్‌లో నటించాల్సి వస్తే ఎవరి పాత్రలో నటిస్తారని ప్రశ్నించగా, విజయ్ ఠక్కున కోహ్లీ అని సమాధానమిచ్చాడు. చూద్దాం మరి భవిష్యత్తులో కోహ్లీ పాత్రలో విజయ్ కనిపిస్తాడేమో.