‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత సినిమాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. పవన్ కళ్యాణ్ తరువాత నటనతో యువతను అంతగా ప్రభావితం చేసిన హీరో విజయ్ దేవరకొండ ఒక్కడే అని మెగాస్టార్ చిరంజీవి కూడా కితాబునిచ్చారు. అయితే గత కొద్దిరోజులుగా విజయ్‌కి పూర్తిగా బ్యాడ్ టైం నడుస్తుంది. మునుపటి హిట్స్ లేక విజయ్ కెరీర్ కాస్త డల్ అయిన మాట వాస్తవమే. అయితే కెరీర్‌లో ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా విజయ్ క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదనే చెప్పాలి. తెరపై బోల్డ్ సీన్స్, బోల్డ్ టాక్‌తో ఆకట్టుకునే విజయ్‌కి తెరవెనుక మాత్రం ఎలాంటి వివాదాలు లేవనే చెప్పాలి. అలాంటి విజయ్ దేవరకొండపై సంచలన కామెంట్స్ చేసింది బెంగాలీ నటి, సింగర్ మలోబిక బెనర్జీ.
అర్జున్ రెడ్డి కంటే ముందు విజయ్ చేసిన ‘నీ వెనకాలే నడిచి’ అనే మ్యూజిక్ వీడియోలో నటించింది vఆ షూటింగ్ లో విజయ్ తరచుగా హిందీ భాషనీ అవమానించేలా మాట్లాడేవాడని తెలిపింది. ‘అప్పుడు అతనికి హిందీ రాదు. అతనికి అలవాటు కావాలని హిందీ మాట్లాడేదాన్ని. ఆ భాష హిబ్రూలా ఉందని ఎగతాళి చేసేవాడు. తెలుగులోనే మాట్లాడేవాడు. ఇప్పుడు అతడు హిందీ మూవీ చేయడంతో ఆశ్చర్యపోయాను. కానీ అతడు నా బెస్ట్ ఫ్రెండ్. లైగర్ సినిమాలో అతనికి హిందీలో డైలాగుతు తక్కువ.. అతడు చాలా మంచోడు..’ అని చెప్పిందామె.