Vijay Deverakonda keeps his promise, sends 100 fans to Manali on all expense paid trip!
mictv telugu

100 మంది అభిమానులను మనాలీకి పంపిన దేవర సాంటా!

February 18, 2023

Vijay Deverakonda keeps his promise, sends 100 fans to Manali on all expense paid trip!

ఫ్యాన్స్ లేకపోతే హీరోలు లేరు. అందుకే అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలనుకోవడంలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు దేవర సాంటాగా మారి 100మందిని తన సొంత ఖర్చులతో మనాలీ ట్రిప్ కి పంపించాడు. నెట్టింట వారి వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో చివరగా కనిపించాడు విజయ్ దేవరకొండ. మరిన్ని ప్రాజెక్టులతో బిజీ బిజీ షెడ్యూల్ ని గడుపుతున్నాడు. అయితే తన అభిమానులను, వారికి ఇచ్చిన మాటను మాత్రం మరువడు ఈ బంగారు కొండ. అందుకే క్రిస్మస్ సాంటాగా మారి అభిమానులకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేశాడు.

విజయ్ దేవరకొండ.. తన పుట్టిన రోజు, క్రిస్మస్, న్యూ ఇయర్ ని ఎప్పుడూ ప్రత్యేకంగా, ముఖ్యంగా తన అభిమానులు గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తుంటాడు. ఈసారి కూడా దేవర సాంటా అని ఒక పోటీని నిర్వహించాడు. మంచుతో కప్పబడిన మనాలికి తన సొంత ఖర్చులతో 100మంది అభిమానులను పంపుతానని చెప్పాడు. అన్నట్టుగానే వేరు వేరు ప్రదేశాల నుంచి అభిమానులను సెలెక్ట్ చేశారు. వారికి ముందుగానే తెలియచేసి హైదరాబాద్ నుంచి నిన్న ఆ అభిమానులు విమానంలో మనాలీకి బయలుదేరారు. వారికి సంబంధించిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నది.

విజయ్ ప్రస్తుతం తన రాబోయే తెలుగు రొమాంటిక్ డ్రామా ఖుషీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సమంతా రుతు ప్రభుతో కలిసి నటిస్తున్న ఈ సినిమా మధ్యలో సమంత ఆరోగ్యం కారణంగా వాయిదా పడింది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు 4 నుంచి 5 వారాల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉన్నట్లు అంచనా. ఇది కాకుండా పూరీ దర్శకత్వం వహించే జనగణమనలో నటించనున్నారు. అంతేకాదు గీత గోవిందం సీక్వెల్ ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ సంవత్సరం ఏ సినిమాతో ముందుగా విజయ్ అభిమానులను పలకరిస్తాడో వేచి చూడాల్సేందే!!