Vijay Deverakonda on dating with Rashmika
mictv telugu

రష్మికతో డేటింగ్‌పై విజయ్ దేవరకొండ.. భలే చెప్పేశాడు

July 29, 2022

హీరోయిన్ రష్మిక మందన్నా, హీరో విజయ్ దేవరకొండల మధ్య ప్రేమాయణం నడుస్తోందని, భవిష్యత్తులో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చన్న పుకార్లు గతంలో వచ్చాయి. వారిద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించడం, వారి మధ్య ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ వర్కవుట్ కావడంతో చాలా మంది నిజమేనని భావించారు. అయితే ఈ విషయంపై అటు రష్మిక కానీ, ఇటు విజయ్ దేవరకొండ కానీ స్పందించలేదు. తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ వద్ద ప్రస్తావించాడు. ఆయన హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘రష్మికతో నీ రిలేషన్‌షిప్ ఏంటన్నది ఎందుకు చెప్పవు’? అని కరణ్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ‘కెరీర్ ఆరంభంలో మేమిద్దరం రెండు సినిమాలు చేశాం. ఆమె నాకు ఇష్టమైన వ్యక్తి. సినిమాల విశేషాలను తరచూ షేర్ చేసుకుంటాం. దాంతో బంధం ఏర్పడుతుంది. దీని గురించి టైం వచ్చినప్పుడు గట్టిగా అరచి చెప్తా. అప్పటివరకు నన్ను ఆరాధించే వారిని బాధపెట్టను. రష్మిక ఫోటోలను అబ్బాయిలు, నా ఫోటోలను అమ్మాయిలు వాల్ పేపర్లుగా, వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంటారు. ఈ విషయం చెప్పి వారిని హర్ట్ చేయను. వారి ప్రేమకు విలువిస్తాను’ అని బదులిచ్చాడు. అంటే నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని పరోక్షంగా చెప్పినట్టయింది. కాగా, వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.