Vijay Deverakonda opens up about romance in koffee with Karan Show
mictv telugu

సెక్స్‌పై విజయదేవరకొండ షాకింగ్ కామెంట్

July 26, 2022

బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాత కరణ్ జోహార్ యాంకర్ గా కాఫీ విత్ కరణ్ షో కు ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఈ షో బాలీవుడ్ లో బాగా ఫేమస్. ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ షో.. ఏడో సీజన్ కూడా తాజాగా ప్రారంభమైంది. ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న ఈ షో లో గతవారం ఎపిసోడ్ గెస్ట్‌లుగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సమంత హాజరయ్యారు. ఇక రాబోయే ఎపిసోడ్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో కరణ్.. విజయ్ దేవరకొండ సెక్స్ లైఫ్ గురించి అడిగారు.

కరుణ్ జోహార్ స్టైయిట్ గా విజయ్ దేవరకొండను..నువ్వు ఎప్పుడు చివరగా సెక్స్ చేసావు అని అడిగారు. దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్పబోతూంటే ప్రక్కనే ఉన్న అనన్య పాండే అందుకునే ఈ రోజు ఉదయం అయ్యి ఉండచ్చు అని చెప్పింది. దానికి కరణ్ జోహార్ కౌంటర్ వేసారు. దానికి విజయ్ దేవరకొండ పెద్దగా నవ్వేశాడు. అలాగే నువ్వు పబ్లిక్ ప్లేస్‌లలో చేయటానికి ఇష్టపడతావా లేక అంటే విజయ్ దేవరకొండ కార్స్ అన్నాడు. దీంతో కరణ్ జోహార్ అక్కడ కంపర్టబుల్ గా ఉంటుందా అని అడగ్గా.. దానికి విజయ్ దేవరకొండ డెస్పరేట్ టైమ్స్ అంటూ సమాధానం చెప్పి కన్ను కొట్టారు. దానికి కరుణ్ జోహార్ ఓ రేంజిలో ఎక్సప్రెషన్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది

కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ స్టార్స్ తో చేసిన ఈ షో ఈ సారి మరింత కొత్తగా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ సెలబ్రిటీలని తీసుకురాబోతున్నారు.