Vijay Deverakonda released the song promo of Liger
mictv telugu

‘లైగర్’ నుంచి ‘అకడి పకడి’.. మాస్ స్టెప్పులేసిన విజయ్

July 8, 2022

Vijay Deverakonda released the song promo of Liger

పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న లైగర్ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమాలోని ‘అకడి పకడి’ అంటూ సాగే పాటను జులై 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ పాట వీడియో ప్రొమోను విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో శుక్రవారం విడుదల చేశారు.

ఇందులో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండేలు ఊర మాస్ స్టెప్పులతో కనువిందు చేశారు. స్టైలిష్ లుక్‌లో విజయ్ చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 25న విడుదలయ్యే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రంలో రియల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాను కరణ్ జోహార్, ఛార్మీలు నిర్మిస్తున్నారు.