శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ! - MicTv.in - Telugu News
mictv telugu

శోభన్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ!

December 7, 2019

Vijay Deverakonda.

ఓవైపు హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ మరోవైపు ప్రాముఖ్యమున్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. ఆమధ్య వచ్చిన ‘మహానటి’ చిత్రంలో కూడా విజయ్ అలాంటి పాత్రే పోషించాడు. తాజాగా విజయ్ మరో విభిన్న పాత్రలో నటించడానికి సిద్ధమయ్యాడు. అలనాటి సోగ్గాడు శోభన్‌ బాబు పాత్రలో కనిపించనున్నాడట. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో శోభన్ బాబు పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయగా కంగనా రనౌత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలకపాత్రలు పోషిస్తున్న వారి వివరాలను చిత్రబృందం ప్రకటించింది. అయితే జయలలిత జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన శోభన్‌బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు విజయ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ చిత్రంలో జయలలిత ఇష్టసఖిగా ప్రియమణి నటిస్తోందని తెలుస్తోంది.