రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ల కలయికలో వస్తున్న తాజా చిత్రం లైగర్. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్ర ప్రమోషన్‌ని చిత్ర బృందం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో శనివారం చిత్రం నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇందులో పూర్తి నగ్నంగా ఉన్న విజయ్ దేవరకొండ నడుము కింది భాగాన్ని మాత్రం పూలతో కవర్ చేశాడు. అంతేకాక ‘ఈ సినిమాకు వంద శాతం శారీరకంగా, మానసికంగా కష్టపడ్డాను. నా ప్రతిభ అంతా పెట్టాను. త్వరలో మీ ముందుకు వస్తున్నా’నంటూ ట్వీట్ చేశాడు. ప్రముఖ రెజ్లర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, విజయ్ దేవరకొండకు ఇది తొలి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం..