Vijay Gupta danced shirtless in KBK show
mictv telugu

KBK అమితాబ్ షోలో షర్ట్ విప్పి రచ్చ చేసిన కంటెస్టెంట్.. వీడియో

August 27, 2022

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా చేస్తున్న ఫేమస్ షో కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 14 ఇటీవలే మొదలైంది. ఈ షో ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ షోలో ఎంటరయ్యేందుకు నిర్వహించే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రౌండులో గెలుపొందిన ఓ వ్యక్తి ఆనందం పట్టలేక చొక్కా విప్పి వేదికపై హంగామా చేశాడు. అమితాబ్, ప్రేక్షకుల ముందు అతను చేసిన చేష్టలపై నిర్వాహకులు తాజాగా ఓ ప్రొమో రిలీజ్ చేశారు. ప్రొమో ప్రకారం.. విజయ్ గుప్తా అనే 40 ఏళ్ల వ్యక్తి హాట్‌సీట్‌లోకి రాబోతున్నాడని ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో కూర్చున్న విజయ్.. చొక్కా విప్పి డ్యాన్స్ చేస్తూ వేదిక అంతా కలియదిరిగారు. దీంతో అమితాబ్‌తో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇలా తిరుగుతూ తన భార్య దగ్గరికి వెళ్లి హగ్ ఇచ్చాడు విజయ్. ఇదంతా చూసి చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్‌తో అమితాబ్.. అతడిని చొక్కా వేసుకోనివ్వండి మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే అతను ఇంకా ఏం విప్పుతాడోననే భయం వేస్తోందని కౌంటర్ ఇవ్వడంతో అందరూ సరదాగా నవ్వుకున్నారు. దీంతో విజయ్ చొక్కా వేసుకొని హాట్ సీట్‌లో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.