‘అర్జున్ రెడ్డి’ డ్రెస్ అదుర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ డ్రెస్ అదుర్స్…

September 12, 2017

‘అర్జున్ రెడ్డి’ మూవీతో ప్రశంసల జల్లులు కురిపించుకున్న విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్టార్ అట్రాక్షన్ గా మారారు. యువతీయువకులు ఆయనను పోస్టులను, వార్తలను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారు. తాజాగా అతడు డిజైనర్ దుస్తులు ధరించి ధరించి చుక్కల్లో చంద్రుడిలా వెలుగుపోతూ అభిమానులను అలరిస్తున్నాడు ఫేస్ బుక్ లో. స్టైలిస్ట్ శ్రావ్యా వర్మ, ఫ్యాషన్ డిజైనర్లు శాంతను, నిఖిల్ తీర్చిదిద్దిన దుస్తులు, స్టయిల్ తో అర్జున్ రెడ్డి అదరగొడుతున్నాడు.

మందపాటు కోటు, తెల్లప్యాంటుపై లుంగీని తలపించే ఈ డ్రస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘టాలీవుడ్ కు మరో హాలీవుడ్ హీరో దొరికాడు.. టాలీవుడ్ లో మహేష్ బాబే కాదు విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు’ అని ఒకరు కామెంట్ చేశారు. ఈ ఫోటోలు పోస్ట్ చేసిన విజయ్.. ‘ఫర్ యువర్ వ్యూయింగ్ ప్లెజర్’ అని సరదాగా రాశారు. అర్జున్ రెడ్డి అదేనండి విజయ్..  ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఫిలిమ్స్ తో ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యాడు. పరశురామ్ దీనికి దర్శకత్వం వహిస్తారు.