బ్యాంకులకు వేలకు వేలు ఎగ్గొట్టిన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.స్టైల్‌గా సిగరెట్ తాగుతూ..క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ గడిపేస్తున్నాడు. అంతే కాదు పిలవని పేరంటాలకు పోతున్నాడట. ఈయన్ను కలిసి వివాదం కొనితెచ్చుకోవడం ఎందుకనుకున్న టీమిండియా ప్లేయర్లు మొహం చాటేశారు.
బాంకు బకాయిలకు ఎగనామం పెట్టి లండన్ చెక్కేసిన విజయ్‌మాల్యా ఇప్పుడు టీమిండియా వెంట పడ్డాడు. మొన్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను దర్జాగా వీఐపీ గ్యాలరీలో నుంచి చూసిన మాల్యా.. తాజాగా ఇండియన్ టీమ్ వెళ్లిన చారిటీ డిన్నర్‌కు వచ్చాడు. అయితే అతని రాకను ముందే తెలుసుకున్న టీమ్ ప్లేయర్స్.. మాల్యాకు దూరంగా ఉన్నారు. అనవసరం వివాదం ఎందుకు అనుకొని.. కాస్త ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ కార్యక్రమాని మాల్యా.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వస్తున్న వీడియో కూడా నెట్లో వైరల్ అవుతోంది. మాల్యా రావడంతో కోహ్లితోపాటు మిగతా ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారని బీసీసీఐ అంటోంది.కొసమెరుపు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది విరాట్ ఫౌండేషనే. కానీ అతనుగానీ, ఫౌండేషన్‌గానీ పిలవకుండానే మాల్యా అక్కడికి వచ్చాడు. సామాన్యుల్ని రూల్స్ , చార్జీల బాదుడుతో ఇబ్బంది బ్యాంకులకు ఇలాంటోడే సరైనోడు అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.