మూడో పెళ్లికి విజయ్ మాల్యా రెడీ - MicTv.in - Telugu News
mictv telugu

మూడో పెళ్లికి విజయ్ మాల్యా రెడీ

March 28, 2018

జల్సారాయుడు, బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు ఎగిరిపోయిన వ్యాపారి విజయ్ మాల్యా మూడో పెళ్లికి రెడీ అయ్యాడు. తన గర్ల్ ఫ్రెండ్, కింగ్‌ఫిషర్ మాజీ ఎయిర్ హోస్టెస్ పింకీ లాల్వానీని రేపోమాపో పెళ్లాడబోతున్నాడు. 62 ఏళ్ల మాల్యాకు ఇది మూడో పెళ్లి. కేసులు, విచారణ, నోటీసులు.. వంటివాటితో సంబంధం లేకుండా ఈ జంట లండన్ శివారులో ఓ రిస్టార్ట్‌లో ఖుషీగా గడుపుతోంది.  వీరికి 2011 నుంచి పరిచయం ఉంది. బహిరంగ రొమాన్స్ చేస్తూ చాలాసార్లు మీడియా కంటపడ్డారు. మాల్యా ‘కష్ట సమయాల్లో’ ఉన్నప్పుడు పింకీ అతనికి చేయూత అందించిందంట.

మాల్యా మొదటి మాజీ భార్య సమీరా తయ్యాబ్జీ. రెండో భార్య రేఖ మాల్యా. ఆమె నుంచి ఇంకా విడాకులు తీసుకోలేదు. మాల్యా భారత బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాను నీతిమంతుడినని, భారత ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని బ్రిటన్ కోర్టుల్లో ఎదురుదాడి చేస్తున్నాడు. అతన్ని పట్టుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నామని మోద ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.