దొంగలా పారిపోయి మీసం మేలేస్తున్నాడురో..! - MicTv.in - Telugu News
mictv telugu

దొంగలా పారిపోయి మీసం మేలేస్తున్నాడురో..!

July 14, 2017

దేశం దాటి పారిపోయిన దొంగ గుర్తున్నాడు కదా.. దొంగలకే దొంగ..గజదొంగ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. లండన్ సందుల్లో తిరుగుతూ దొంగ దొంగ అని ఇండియన్స్ తిట్టినా సిగ్గులేకుండా దర్జాగా బతికేస్తున్నాడు. బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టి బిందాస్ రాయల్ లండన్ లైఫ్ గడుపుతున్నాడు. అంతేకాదు నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నాడు. ఎలాగు భారత్ వచ్చేది లేదనుకున్నాడో…ఇక్కడా ఏం మిస్ కాలేదంటూ కూతలు కూస్తున్నాడు.

ఓ రిపోర్టర్ మాల్యాతో మాట్లాడుతూ.. భారత్‌ను మిస్సవుతున్నారా? అని అడిగాడు. దీనికి జవాబిచ్చిన మాల్యా.. ‘అక్కడ మిస్సవడానికి ఏం లేదు. నా కుటుంసభ్యులంతా ఇంగ్లాడ్‌, అమెరికాల్లో ఉన్నారు. భారత్‌లో నాకంటూ ఒక్కరు కూడా లేరు. నా తోబుట్టువులు కూడా యూకే పౌరసత్వం పొందినవారే. ఇక కుటుంబపరంగా భారత్‌లో మిస్సవడానికి ఏం లేదు’ అని చెప్పుకొచ్చాడు. తనపై కావాలనే ఇలాంటి కేసులు పెడుతున్నారని ఆనేశాడు.

చుట్టాలు బక్కాలు అందరూ లండన్ లో ఉన్నారు కదా..ఇక్కడ నీకేం పనిలే. ఉన్నది ఊడ్చుకుపోతివి..లేనిది ఎందుకు వస్తావు.. అస్సలు రావు..రప్పించే మొనగాళ్లు లేరనుకున్నావా మాల్యా సాబ్ ..ఖర్మ కాలితే… కాలం కలిసి రాకపోతే..మంట మంట వచ్చి తీహార్ జైలులో కూర్చుంటావ్… ఆ రోజుల్లో కోసమే బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి.