విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసి థియేటర్లోకి వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీతో మొదటిరోజు వసూళ్లు బాగానే ఉన్నా మౌత్ టాక్‌తో రెండో రోజు నుంచి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇంతటి దారుణ పరాజయాన్ని చూసిన సినిమా మరోటి లేదని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దీంతో విజయ్ తన పట్ల ఏర్పడిన దురభిప్రాయాన్ని తొలగించుకునే పనిలో పడ్డాడు. బాలీవుడ్లో నచ్చని సినిమాలను బహిష్కరించాలంటూ నడుస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పట్ల విజయ్ సినిమా విడుదలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ముంబైలోని మరాఠా మందిర్ అండ్ గైటీ గెలాక్సీ థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
I expect our #Bollywood stars should learn something from @TheDeverakonda
Humbleness is the key to success. Keep going Vijay! #VijayDevarakonda #ManojDesai pic.twitter.com/76xZnSyVIO
— Ravi Gupta (@FilmiHindustani) August 28, 2022
విజయ్ అహంకారం వల్ల థియేటర్లకు జనాలు రావట్లేదని, కలెక్షన్లు పడిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించాడు. అంతేకాక, అమీర్ ఖాన్‌ను చూసి నేర్చుకోవాలంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. దీంతో విజయ్ ముంబై చేరుకొని మనోజ్ దేశాయ్‌ని కలుసుకొని తన ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. తన మాటలను సందర్భోచితంగా తీసుకోవాలని ఆయన పాదాలకు నమస్కరించాడు. దీంతో చల్లబడ్డ మనోజ్.. ‘విజయ్ నిజంగా చాలా మంచి వ్యక్తి. ఎదిగినా ఒదిగి ఉండే మనిషి. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేదేంటంటే అతని సినిమాలన్నింటినీ నేను ప్రదర్శనకు తీసుకుంటా. అతనికి మంచి జరగాలి’ అంటూ ఆశీర్వదించి వీడియోను విడుదల చేశారు.