విజయ్.. పోస్టర్ అదిరింది: సమంత - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్.. పోస్టర్ అదిరింది: సమంత

July 3, 2022

టాలీవుడ్ యంగ్ హీరో, ప్రేక్షకుల మనసులలో రౌడీ బాయ్‌గా పేరుగాంచిన విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ న్యూడ్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫోటోను వీక్షిస్తున్న నెటిజన్స్ ‘అయ్యో విజయ్ ఏంటీ ఈ అరాచకం’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫోటోను చూసి ఆశ్చార్యానికి గురౌతున్నారు. అయితే, విజయ్ బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ నటి సమంత మాత్రం ‘విజయ్..పోస్టర్ అదిరింది’ అంటూ ఇన్‌స్టా గ్రామ్‌లో పేర్కొంది.

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్‌ల కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. ఈ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ను షురూ చేసింది. శనివారం లైగర్ చిత్రం నుంచి విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ బట్టలు లేకుండా పూర్తి నగ్నంగా ఉన్నాడు. కేవలం నడుము కింది భాగాన మాత్రమే పూలతో కవర్ చేశాడు. ఈ పోస్టర్‌ విడుదలైన మరుక్షణమే నెటిజన్స్ తెగ షేర్లు చేశారు.

ఈ క్రమంలో ఫోటోపై అభిమానులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిసస్తున్నారు. ”విజయ్‌కి నియమ నిబంధనలు బాగా తెలుసు. కాబట్టి వాటిని బ్రేక్‌ చేయగలడు కూడా. ధైర్యం, కీర్తి ఆయన సొంతం. లైగర్‌ పోస్టర్‌ అదిరింది” అని సమంత ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దానికి వెంటనే విజయ్ స్పందిస్తూ..’సామ్‌ నువ్వు బెస్ట్‌’ అని రిప్లై ఇచ్చాడు. ఇక, విజయ్ న్యూడ్ ఫోటోపై సమంతతోపాటు తమన్నా, అనుష్క, జాన్వీ కపూర్‌, రాశీఖన్నా కూడా ఆ పోస్టర్‌పై స్పందిస్తూ, విజయ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.