విజయ్ - సమంతల ‘ఖుషీ’ ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ – సమంతల ‘ఖుషీ’ ప్రారంభం

April 21, 2022

sam

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన స్పీడు పెంచాడు. పూరీ దర్శకత్వంలో తను నటిస్తున్న లైగర్ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా, అదే దర్శకుడితో ‘జనగణమన’ సినిమాను ఒప్పుకున్నాడు. తాజాగా సున్నిత ప్రేమ కథల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ కొట్టాడు. సమంత జోడీగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ జవానుగా నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం కాశ్మీర్‌లో షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, పవన్ కల్యాణ్ సూపర్ హిట్ చిత్రం ఖుషీ మూవీ టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.