కృతిశెట్టి కూతురితో సమానం, రొమాన్స్ చేయలేను.. విజ‌య్ సేతుప‌తి - MicTv.in - Telugu News
mictv telugu

కృతిశెట్టి కూతురితో సమానం, రొమాన్స్ చేయలేను.. విజ‌య్ సేతుప‌తి

September 6, 2021

Vijay Sethupathi Says NO To Krithi Shetty

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి తెలుగు చిత్ర‌సీమ‌లో సైతం త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. సైరా నరసింహ రెడ్డి, ఉప్పెన వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైన సేతుప‌తి.. తాజాగా శృతిహాస‌న్‌తో  క‌లిసి లాభం అనే చిత్రంలో న‌టించారు. ఏక‌కాలంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా.. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆయ‌న‌ న‌టి కృతిశెట్టిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

‘తెలుగులో ఉప్పెన సినిమా త‌ర్వాత తమిళంలో ఒక సినిమాకి ఓకే చెప్పాను. అందులో హీరోయిన్‌గా కృతిశెట్టి బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమె ఫోటోను నాకు పంపారు. వెంట‌నే నేను మా యూనిట్‌కి ఫోన్ చేసి.. ఇదివ‌ర‌కే ఆమెకు నేను తండ్రిగా నటించాను. ఈ సినిమాలో ఆమెతో నేను రోమాన్స్ చేయలేను.. అందుకే హీరోయిన్‌గా కృతి వద్దని చెప్పాను’ అని విజయ్ సేతుపతి తెలిపారు.

‘ఉప్పెన సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో కృతిశెట్టి కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు… నువ్వు కూడా నా కూతురుతో సమానం.. భ‌య‌ప‌డ‌కు.. ధైర్యంగా చెయ్ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన కృతిశెట్టిని జోడీలా భావించ‌డం నా వల్ల కాదు’ అని విజ‌య్ సేతుప‌తి వెల్ల‌డించారు.