ఆంధ్ర అబ్బాయిగా విజయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్ర అబ్బాయిగా విజయ్..!

August 30, 2017

తన మొదటి సినిమా నుంచి  తెలంగాణ  యాసలో మాట్లాడుతూ  ప్రేక్షకుల్ని అలరించిన  విజయ్ దేవరకొండ సడన్ గా ఇప్పుడు తన రూట్ మార్చబోతున్నాడు. తొలిసారి కంప్లీట్ ఆంధ్రా యాసలో మాట్లాడుతూ ఓ సినిమా చేయబోతున్నాడు. భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ ‘పెళ్లి చూపులు’ సినిమాకు ముందే విజయ్ కి ఓ కథ చెప్పాడట. ఆ కథ విజయ్ కి చాలా నచ్చిందట. ఆ సినిమా ఇపుడు  పట్టాలెక్కబోతుంది. ఆ సినిమాలో విజయ్ కాకినాడ కాలేజీ కుర్రోడిగా కనిపించబోతున్నాడట.  

సినిమా మొత్తం ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా  తెరకెక్కబోతుంది.  షూటింగ్ అంతా కాకినాడలోనే తీస్తారని సమాచారం. అయితే  తన మొదటి సినిమా ’పెళ్లి చూపులు’ దగ్గరనుంచి  ఇప్పుడు ’అర్జున్ రెడ్డి’ వరకు హైదరాబాదీ కమ్ పల్లె తెలంగాణ యాస, భాషతో అందరినీ ఆకట్టుకున్న విజయ్, సడన్ గా ఆంధ్ర యాస మాట్లాడితే.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి. తెలంగాణ తొలి మెగాస్టార్, నిజమైన పవర్ స్టార్ అని వర్మ చేత పిలుపించుకున్న  విజయ్,ఇప్పుడు ఆంధ్ర అబ్బాయిగా కనబడితే ఆయన కూడా ఎలా రియాక్ట్ అవుతాడో సూడాలె మరి.