Vijay Varasudu Movie Talk Shocks To Dil Raju
mictv telugu

వారసుడు రిజల్ట్ రివర్స్.. దిల్ రాజుకి భారీ షాక్..!

January 14, 2023

తెగింపు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, ‘కళ్యాణ వైభోగమే’.. సంక్రాంతి రేసులో పోటీ పడుతున్నతెలుగు సినిమాల లిస్ట్ ఇది. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా వచ్చిన తెగింపు తొలి సంక్రాంతి చిత్రంగా జనవరి11న విడుదలైంది. పోటీ లేకపోవంతో ఒక మోస్తరు కలెక్షన్స్ సాధించింది తెగింపు. ఆ తరువాత జనవరి 12న బాలకృష్ణ వీరసింహారెడ్డి విడుదల కావటంతో మెజారిటీ థియేటర్స్ కోల్పోయింది తెగింపు. ఇక జనవరి 13న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య విడుదల కావటంతో తెగింపు అడ్రెస్ లేకుండా పోయింది. అసలు ఆ సినిమా టాక్ ఏంటో కూడా తెలీదు. కానీ మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తో తెగింపు గండం గట్టెక్కినట్టే తెలుస్తుంది.

ఇక మరోవైపు డివైడ్ టాక్ తో వీరసింహారెడ్డి దూసుకెళ్తుంది. మాస్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ మైనస్ అయినప్పటికీ బాలకృష్ణ చిత్రానికి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రెండు రోజులకే 40శాతానికి పైగా కలెక్షన్స్ వచ్చేశాయని అంటున్నారు. ఇక ఇంకోవైపు మెగాస్టార్ వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా ఇదే. కామెడీ ఎంటర్టైనర్ అని టాక్ రావటం మెగాస్టార్ కి కలిసొచ్చే అంశం. టాక్ కి సంబంధం లేకుండా అభిరుచి మేరకు ప్రేక్షుకులు ఈ రెండు సినిమాలని ఆదరించే అవకాశాలు ఉన్నాయి. పండగ సీజన్ అయిపోయే వరకు చిరు, బాలయ్యలు లాభాల బాట పట్టె ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఇక సంక్రాంతి ఎండ్ లో రిలీజ్ కానున్న మరో రెండు చిత్రాలు వారసుడు, కళ్యాణ వైభోగమే. అగ్ర నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తున వారసుడుని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు. పంతం పట్టి మరి మెగాస్టార్, బాలయ్యల సినిమా థియేటర్స్ కి సమానంగా డబ్బుంగ్ మూవీ వారసుడుని రిలీజ్ చేసినా రిజల్ట్ కాస్త తేడా కొట్టేలానే కనిపిస్తుంది. నాలుగు రోజుల ముందే తమిళంలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న వారసుడుకి తెలుగులో కనీసం ఈ టాక్ కూడా రాలేదని అంటున్నారు.

పదుల సంఖ్యలో హిట్ అయిన తెలుగు సినిమాలని కలిపి తీసిన కలబోతగా వారసుడు ఉందని ఇప్పటికే తెలుగు ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మాస్ మూవీ కాకపోవడం వారసుడికి మరో ప్రధాన మైనస్. తమిళంలోనే అండర్ పెర్ఫామ్ చేస్తున్న సినిమా.. తెలుగులో చిరు, బాలయ్యల సినిమాలను ఢీకొట్టి నిలవడం కష్టమే అనిపిస్తోంది. మరి ఈ స్థితిలో దిల్ రాజుకు ‘వారసుడు’ ఏ మాత్రం సంతోషాన్నిస్తుందో చూడాలి. ఇక చివరిగా ‘కళ్యాణం కమనీయం’ మీద కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు కానీ.. దాని ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించింది. దాని బడ్జెట్ కూడా తక్కువ. టాక్ బాగుంటే ఈ సినిమా ఈజీగా బయటపడే ఛాన్సుంది.