Vijay Varisu movie trailer release
mictv telugu

విజయ్ వారిసు ట్రైలర్ రిలీజ్.. కథ మొత్తం చెప్పేశారుగా

January 4, 2023

తమిళనాడు స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం వారిసు చిత్ర తమిళ్ వెర్షన్ ట్రైలర్ రిలీజయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. ఓ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీకి చెందిన చిన్న కొడుకుగా విజయ్ కనిపించాడు. అన్నలుగా కిక్ శ్యామ్, శ్రీకాంత్, అమ్మగా జయసుధ నటించారు. విజయ్ అందరికంటే భిన్నంగా తనదైన ప్రపంచంలో జీవిస్తూ కుటుంబానికి దూరంగా ఉంటాడు. అయితే కుటుంబ వ్యాపారంలో శత్రువులు పెరిగారని తెలిసి సమస్యను పరిష్కరించేందుకు ఇంటికి వస్తాడు. దాంతో పాటు కుటుంబంలో వచ్చిన మనస్పర్థలను కూడా తొలగించి కుటుంబాన్ని మళ్లీ కలుపుతాడు. ట్రైలర్ లో ఇదంతా ఉండడంతో సినిమా ఎలా ఉండబోతుందో ముందే క్లారిటీ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు, కెమెరా పనితనం, విలన్ గా ప్రకాశ్ రాజ్, కమెడియన్ యోగిబాబు ఆకట్టుకున్నారు. ఇక రష్మిక పాత్ర నామమాత్రమేనని తెలుస్తోంది. కేవలం పాటలకే పరిమితం అన్నట్టు కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ పక్కా తమిళ సినిమాలో హీరో, కమెడియన్ తప్ప మిగతా ఆర్టిస్టులందరూ తెలుగువారే కావడంతో మనవాళ్లకు నచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెప్పే మాట.