స‌రిలేరు నీకెవ్వ‌రు..విజయశాంతి లుక్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

స‌రిలేరు నీకెవ్వ‌రు..విజయశాంతి లుక్ వచ్చేసింది

October 26, 2019

నటుడు మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వస్తున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావ‌ళి కానుకగా విజ‌యశాంతి ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు విడుద‌ల చేసింది. ఈ సినిమాలో విజ‌య‌శాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ పాత్ర‌లో కనిపించ‌నున్నార‌ని సమాచారం.

విజయ శాంతి 90వ దశకంలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించుకున్నారు. 2006లో ఆమె చివరిసారిగా నటించారు. మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాలో మ‌హేష్ బాబు మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.