జగన్ నాకు విజయనగరం జిల్లా రాసిస్తే పాలించుకుంటా.. వింత డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ నాకు విజయనగరం జిల్లా రాసిస్తే పాలించుకుంటా.. వింత డిమాండ్

February 3, 2020

VIJAYANAGARAM.

‘మాకేం సమస్యల్లేవు. సీఎం జగన్ గారు నాకు మా విజయనగరం జిల్లాను ఇస్తే  నేనే పాలించుకుంటా’ అంటున్నాడు బొబ్బికి చెందిన ఈశ్వరరావు. స్థానికులు, పోలీసులకు తలనొప్పిగా మారి ఈ వింత డిమాండ్ వెనుక పెద్ద కథే ఉంది.  బొబ్బిలిలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈసపు ఈశ్వరరావు తన భార్య, ఇద్దరు పిల్లలతో నాలుగేళ్లుగా నాలుగు గోడల మధ్యే జీవితం వెళ్లబుచ్చుతున్నాడు. ఆహారం పదార్థాల కోసం తప్ప వీరు బయటికి రావడం లేదు. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. బంధుమిత్రులను కూడా ఇంటికి రానివ్వకుండా గడియపెట్టుకుని జీవిస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్లు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 

‘రాష్ట్రంలో విద్యావిధానం బాగాలేదు. ఫీజలు తగ్గించాలని. అమ్మఒడి పథకాలు కార్పొరేట్ స్కూళ్లకే మేలు చేస్తున్నాయి. అందుకే మా పిల్లలను స్కూలుకు పంపడం లేదు’ అని ఈశ్వరరావు వాదిస్తున్నాడు. మీ సంగతెలా ఉన్నా, పిల్లల జీవితాలు బాగుపడాలంటే బడికి పంపాలని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈశ్వరరావు దిగొచ్చాడు. ఈశ్వరరావు కుటుంబం మానసిక సమస్యలతో బాధపడుతోందని, వారికి చికిత్స చేయిస్తామని పోలీసులు చెబుతున్నారు.