Vijayapriya representative Nithyananda kailasa hindu country real story
mictv telugu

కైలాసదేశ ప్రతినిధి.. నిత్యానంద ప్రియురాలా?

March 1, 2023

 Vijayapriya  representative Nithyananda kailasa hindu country real story

మనకు శివుడి కైలాసం తెలుసు. కానీ సార్వభౌమాధికారం గల కైలాస దేశం గురించి పెద్దగా తెలియదు. ఈక్వెడార్ సరిహద్దులో ఉందని చెప్తారు. తను పరమశివుడి అవతారమని చెప్పుకునే రాసలీలల కామాంధ స్వామి నిత్యానంద బ్లాక్ మనీతో కొన్ని ఎకరాలు కొని కైలాస దేశాన్ని తొలి హిందూదేశమంటూ ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. అదంతా అబద్ధమని కొట్టిపడేసేవాళ్లూ ఉన్నారు. కానీ మొన్న జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESR) సమావేశానికి ఆ దేశ ప్రతినిధులు హాజరై కలకలం రేపారు. ముఖ్యంగా విజయప్రియ నిత్యానంద అనే ప్రతినిధి అందర్నీ ఆకట్టుకుంది. తనకు ఐరాసలో కైలాసానికి శాశ్వత రాయబారిని ఆమెను చెప్పుకుంది. భారత్‌ను చెడామడా తెట్టింది. కోట్లమంది ఆరాధ్య దైవమైన తమ దేశాధినేత నిత్యానందను వేధించడం ఆపాలని డిమాండ్ చేసింది. అచ్చం కైలాస దేశాధీశుడైన నిత్యానందలా పెద్ద జటాజూటం, కషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి వచ్చిన విజయప్రియకు ఐరాస నిజంగానే ఆహ్వానం పంపిందా, లేకపోతే గుంపులో గోవిందా అన్నట్లు వచ్చిందా అన్నది తెలియడం లేదు. ఆమెకు చక్కగా సీటు ఇచ్చి, మాట్లాడే అవకాశం కూడా కల్పించారంటే వెనక ఏదో తతంగం జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరీ మహానుభావురాలు..
విజయప్రియ వివరాలు పెద్దగా తెలియడం లేదు. ఆమెది ఏ దేశమో కూడా బయటికి రాలేదుగాని ఉన్నత విద్యావంతురాలని తెలుస్తోంది. లిక్డ్‌ఇన్ వంటి వివిధ సోషల్ మీడియాల్లో ఆమె పేరుతో ఉన్న ఖాతాల్లోని వివరాల ప్రకారం.. విజయప్రియ 2014లో కెనడాలోని మనిటోటా యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీలో డిగ్రీ చేసింది. ఇంటర్నేషనల్ యూజీ స్కాలర్ షిప్ కూడా సంపాదించింది. ఇంగ్లిష్‌తోపాటు ఫ్రెంచ్, క్రియోల్ తదితర భాషలను గలగలా మాట్లాడుతుంది. అయితే ఆమె నిత్యానందకు ఎలా దగ్గరైందో తెలియడం లేదు. ఆమె వేషభాషలను బట్టి చూస్తే స్వాములవారికి చాలా సన్నిహితురాలిగానే భావించాలి. ఆమె నిత్యానందకు ఫిమేల్ వెర్షన్‌లా కనిపిస్తుండంతో ఇద్దరూ చాలా సన్నిహితులే కాకుండా ప్రేమలాంటి వ్యవహారం ఏదో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి ఫొటోలతో బోలెడు ఫన్నీ మీమ్స్ కూడా సందడి చేస్తున్నాయి.