ఒక అమ్మకు, అబ్బకు.. బాబుపై విజయసాయిరెడ్డి ఘోర వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

ఒక అమ్మకు, అబ్బకు.. బాబుపై విజయసాయిరెడ్డి ఘోర వ్యాఖ్యలు

March 27, 2018

రాజకీయాల్లో దిగజారుడు మాటలు సహజమే. అయితే వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అధ:పాతాళంలోకి దిగజారి అసహ్యకరమైన విమర్శలు చేశారు. ‘ఒక అమ్మకు, ఒక అబ్బకు పుట్టినవాడెవరూ చంద్రబాబులా చంద్రబాబులా మాట్లాడడు’ అని అన్నారు. రెడ్డి మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడాడారు. తాను మోదీ కాళ్లకు మొక్కినట్లు చంద్రబాబు ఏ ఆధారాలతో చెబుతున్నారని ప్రశ్నించారు. తాను పార్లమెంటులలో మోదీకి పాదాభివందనం చేసినట్లు వస్తున్న వార్తలపై ఎంపీ స్పందించారు.

‘ఒక వ్యక్తి మనకు నమస్కారం పెట్టినప్పుడు తిరిగి నమస్కారం పెడతాం. అది సంస్కారం. నాకు బద్ధ శత్రువైనా, చంద్రబాబుకు నేను కూడా నమస్కారం పెడతాను. కానీ ఆ సంస్కార బాబుకు లేదు. మోదీకి ఉంది.. నేరగాళ్లందరికీ లీడర్‌ చంద్రబాబు.. చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ.. ఆర్థిక నేరగాడైన విజయ్‌మాల్యాతో నన్ను పోల్చుతాడా? నేను ఇప్పటివరకు ఏ బ్యాంకు నుంచీ ఒక్క రూపాయి తీసుకోలేదు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ.  మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు..’ అని మండిపడ్డారు.

రెడ్డి వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. చంద్రబాబు విధానాలను, అవినీతిని విమర్శించాలిగాని, ఆయన తల్లిదండ్రును కించపరచడమేంటని ప్రశ్నిస్తున్నారు. మనిషి పుట్టుకనే అమానించేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.