Vijayashanthi appealed to Munugode people not to cheat by taking BBC given by KCR
mictv telugu

కేసీఆర్ ఇచ్చే ‘బీబీసీ’కి ప్రజలు మోసపోవద్దు: విజయశాంతి

August 22, 2022

ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే బీబీసీ తీసుకుని మోస పోవద్దని మరో బీజేపీ నేత , మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.బీసీసీ అంటే బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ అని చెప్పారు. 8 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్‌ చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ఆరోపించారు.

తెలంగాణ కోసం కొట్లాడతానని ప్రజలను నమ్మించి.. అధికారం వచ్చాక కుటుంబానికే పదవులు ఇచ్చారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఏమైందని విజయశాంతి నిలదీశారు. తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరులను తుంగలోకి తొక్కినందుకు మిమ్మల్ని సమర్థించాలా? అని ప్రశ్నించారు. దళితుడికి 3 ఎకరాల భూమి, ప్రతి పేద కుటుంబానికి డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు.

“రోజు రోజుకీ కేసీఆర్‌ గ్రాఫ్ పడిపోతోంది. మైండ్‌ గేమ్‌ ఆడుతూ బీజేపీలోని నాయకులను విడదీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్ని మైండ్‌గేమ్‌లు ఆడినా బీజేపీ నేతలను విడదీయలేరు. కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం’ అని విజయశాంతి స్పష్టం చేశారు. త్వరలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని కూడా తెలిపారు.