రాములమ్మకు తెలంగాణ రాజకీయాలు చాలు చాలు అయినట్లుంది. అందుకే హైద్రాబాద్ నుండి బిచాణా ఏత్తేసి మద్రాస్ చలో అంటున్నారట. కొద్ది రోజుల కింద పరప్పన అగ్రహారం జైళ్లున్న చిన్నమ్మ శశికళను కల్సిన వచ్చిన తర్వాత రాములమ్మ మూడ్ మారిందని అంటున్నరు. తాను తెలంగాణ బిడ్డనని… ఇక్కడే తిష్ట వేసుకుని… దొబ్బినా పోనని చెప్పినా రాములమ్మ మరెందుకో తమిళనాడు పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు.
శశికళ జైలు వ్యవహారం సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడారు. బారా బర్ శశికళకు మద్దతునిస్తానని అన్నారు. రెండాకుల గుర్తుకు తానో ఆకునైతానని అంటున్నారు. మరి ఇక్కడి రాజకీయాలు వద్దని అనుకుంటున్నో లేక పోతే ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి అక్కడున్న గ్యాప్ ఫిలప్ చేద్దామనుకుంటున్నరో తెలియదు. తలైవా సూపర్ స్టార్ కే చుక్కలు చూపిస్తున్నారక్కడి నాయకులు… మరి మన రాములమ్మ సంగతి ఎట్లుంటదో.