కూలిన వేదిక.. కిందపడిన రాములమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

కూలిన వేదిక.. కిందపడిన రాములమ్మ

October 12, 2018

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రమాదానికి గురయ్యారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన పార్టీ ప్రచార సభలో ఈ సంఘటన జరిగింది. రాములమ్మ కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా సభావేదిక కూలిపోయింది.

కార్యకర్తలు ఆమెతో కరచాలనానికి ఎగబడ్డంతో తోపులాట జరిగి, ఆ భారానికి వేదిక కూలిపోయింది. ఆ సమయంలో వేదికపై భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య, డీకే అరుణ తదితర నాయకులు కూర్చుని ఉన్నారు. అయితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు.

విజయశాంతిని కార్యకర్తలు వెంటనే పైకి లేపారు. కర్రల స్టేజీని బలహీనంగా కట్టారని, వేదికపై పరిమితికి మించి చేరడతో అది కూలిపోయిందని చెబుతున్నారు. కాగా, సభలో విజయశాంతి.. టీఆర్ఎస్, కేసీఆర్‌లపై తీవ్ర విమర్శలు సంధించారు. ‘దొరాగమనిస్తున్నాం.. దొరాజర.. తగ్గు దొరా.. ’ అని అన్నారు. తన గురించి చెప్పుకుంటూ ‘ఈ రాములక్క మీ కోసం నిలబడే మనిషి . మీకు మంచి చెప్పే మనిషి.. మిమ్మల్ని ముందుకు నడిపించే మనిషి.. నా కుటుంబం తెలంగాణనే. ప్రజలే మా కుటుంబ సభ్యులు. నా కుటుంబం కోసం సర్వం, సమస్తం అప్పగించాను.. నేను మీ కోసం పోరాడతాను.. ’ అని అన్నారు.