విజయవాడలో మృత్యుశకటం - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో మృత్యుశకటం

October 27, 2017

ప్రస్తుత యాంత్రిక యుగంలో చిన్న సాంకేతిక లోపం పెను విషాదానికి దారితీస్తుంది. విజయవాడలో బ్రేకులు ఫెయిలయిన ఓ బస్సు మృత్యుశకటంగా మారి ముగ్గురిని పొట్టన బెట్టుకుంది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. గవర్నర్‌పేట డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు శుక్రవారం పొద్దున గన్నవరం, వాంబేకాలనీ మీదుగా విజయవాడ బస్టాండ్‌ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. మార్గమధ్యంలోని బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే బ్రేకులు విఫలమయ్యాయి. బస్సు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. నాలుగు బైకులను ఢీకొట్టి వాటిని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా..మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి.