విజయవాడ ప్రేమోన్మాదం కేసులో ట్విస్ట్.. వాళ్లిద్దరికీ పెళ్లైందా? - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడ ప్రేమోన్మాదం కేసులో ట్విస్ట్.. వాళ్లిద్దరికీ పెళ్లైందా?

October 16, 2020

nvhnghn

విజయవాడలో బీటెక్ విద్యార్థినిపై జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తీసుకుంది. మృతురాలు దివ్య తేజస్వినిని కత్తితో పొడిచిన చినస్వామి ( నాగేంద్ర)కి గతంలోనే పరిచయం ఉందనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని నిందితుడు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇద్దరూ కలిసి సన్నిహితంగా దిగిన ఫొటో వైరల్ అయింది. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించరనే బాధతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడనే ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. 

దివ్య తల్లి కుసుమ మాత్రం దీన్ని ఖండిస్తోంది. బీటెక్ చదివే తన కూతురు పేయింటర్‌ను ఎలా చేసుకుంటుందని ప్రశ్నించింది. ఎవరో కావాలనే ఫొటోలు మార్పింగ్ చేసి తప్పుదారి పట్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఆ ఫొటోలో దివ్య మెడలో తాళి, అతడికి సన్నిహితంగా ఉండటం చూసి నిందితుడిని విచారిస్తే కానీ అసలు విషయాలు తెలియవని అంటున్నారు. దీంతో

దివ్య కుటుంబ సభ్యులతో పాటూ స్వామి కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చినస్వామి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె నివాసంలో నాగేంద్ర కత్తితో దాడి చేసి ఆ తర్వాత తనను పొడుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దివ్య మరణించగా.. నిందితుడు ఆస్పత్రిలో ఉన్నాడు.