Home > Featured > ‘నేను గొంతు కోయలేదు’.. విజయవాడ దాడి కేసు నిందితుడు

‘నేను గొంతు కోయలేదు’.. విజయవాడ దాడి కేసు నిందితుడు

vijayawada

విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. దాడి ఘటనపై తాజాగా నిందితుడు ఆస్పత్రిలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తాను గొంతు కోయలేదని పేర్కొన్నాడు. ఇద్దరం కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నామని చెప్పాడు. అందుకే దివ్య తేజ తానే గొంతు కోసుకుందని పేర్కొన్నాడు. పెద్దలు తమ పెళ్లి అంగీకరించకపోవడం కారణంగానే తాము ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపాడు. అత్తా మామలు తన భార్యను దూరం చేశారని వాపోయాడు.

ఏడు నెలల క్రితం తాము ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత తన భార్యను పుట్టింటి వారు తీసుకెళ్లారని అన్నారు. వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మూడు రోజుల క్రితం ఆమెతో మాట్లాడేందుకు ఇంటికి వెళ్లానని వెల్లడించాడు. ఆ సమయంలోనే తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నామని చెప్పాడు. కాగా, నాగేంద్ర పెయింటర్‌గా పనిచేస్తుండగా, దివ్యతేజస్విని భీమవరంలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు నాగేంద్ర పెళ్లి డ్రామా ఆడుతున్నాడని ఆరోపించారు.

Updated : 16 Oct 2020 1:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top