విజయవాడలో సీపీ ఆఫీస్ ఉద్యోగి కాల్చివేత - MicTv.in - Telugu News
mictv telugu

విజయవాడలో సీపీ ఆఫీస్ ఉద్యోగి కాల్చివేత

October 11, 2020

Vijayawada firing incident

విజయవాడలో శనివారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆఫీస్‌లో పనిచేసే మహేష్‌ అనే యువకుడు మరణించాడు. ఈ ఘటన బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. 

ఇదే కాల్పుల ఘటనలో మరో వ్యక్తి కడుపులోకి కూడా బులెట్లు దిగాయని తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఓ పథకం ప్రకారం దుండుగులు మహేశ్‌ను హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.