ప్రేమించలేదని యువతి సజీవదహనం.. విజయవాడలో ఘటన  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించలేదని యువతి సజీవదహనం.. విజయవాడలో ఘటన 

October 13, 2020

mbhmghm

ప్రేమకు నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిలా మారిపోయాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. విజయవాడలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనలో యువతి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతా చూస్తుండగానే యువతి సజీవ దహనం కావడం చూసి జనం భయపడిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో ఆ యువకుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. 

కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన యువతి విజయవాడలో నర్సుగా పని చేస్తోంది. స్థానికంగా ఓ అద్దె ఇంటిలో ఉంటూ విధులు నిర్వహిస్తోంది. శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం కొంత కాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువగా కావడంతో ఆమె నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పిలిపించిన మందలించారు. ఇది మనసులో పెట్టుకున్న అతడు విధులు ముగిసిన తర్వాత ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై దాడి చేశాడు. కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పటించాడు. యువతి మరణంతో ఆమె కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అతన్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.